Thursday, November 27, 2008

భారతీవైభవం

బ్రాహ్మీతు భారతీ భాషా గేర్వాగ్వాణే సరస్వతీ - వ్యాహార ఉక్తిర్నపితం భాషితం వకానం వచ : (అమరకోశకారుడు

సర్వసాధారణంగా సరస్వతిని ప్రార్థించడం పరిపాటి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, పద్మపాత్ర విశాలాక్షి పద్మ కేసరవర్ధినీ, తల్లి నిన్నుదలంచి పుస్తకముచేతాన్ బూనితిన్, సరస్వతి మతి మాకు చాలంగనిమ్ము, శరదిందు వికాస మన్దహాసాం, శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే అన్నా శ్లోకాలలో ఎక్కడా భారతి అన్నపదాలు కనిపించవు.

భారతీ స్తుతి

అమరకోశం గ్రంథ రచయిత, అమరసింహుడు మాత్రం సరస్వతిని దేవతగా గ్రహించినట్లులేదు. అమరకోశం లోని స్వర్గవర్గలో శివుడు, విష్ణువు, ఇంద్రుడు, వీరి పేర్లు ఉమాపతి:, లక్ష్మీపతి:, శచీపతి: అని వారి భార్యలతో కలిపి చెప్పాడు. వేరుగా మళ్ళీ, లక్ష్మి, పార్వతి, శచీదేవి .